యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ 2023 పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 3) విడుదల అయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో రిసల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దాదాపు 699 మంది అభ్యర్ధులు తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. వీరందరికీ వైద్య పరీక్షలు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఎన్‌డీఏ, ఎన్ఏలలో 395 పోస్టులకు గానూ గతేడాది ప్రకటన వెలువడింది. ఈ పోస్టులకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కనబరచిన వారికి త్రివిధ దళాల విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా విభాగాల్లో కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తారు.