
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-–2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమైంది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 327 పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చదివి ఉండాలి. వయసు 21 నుంచి -30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 19 ఫిబ్రవరి 2023లో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.upsc.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.