న్యూఢిల్లీ: అనేక రాష్ట్రాలను కలుపుతూ హౌరా-చెన్నై రైల్వే కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొదట ఈ కారిడార్ ను 3లైన్ల నిర్మాణానాకి ఆమోదం పొందింది. అయితే మొత్తంగా 4లైన్ల నిర్మాణం చేపట్టేందుకు ఈ కారిడార్ సామర్థ్యాన్ని పెంచాలని ఆలోచిస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ అ న్నారు.
ఈ కారిడార్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ నుంచి వరంగల్ వరకు కలిపేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జునాగఢ్, నవరంగ్ పూర్, మల్కన్ గిరి, పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్లు ఈ కారిడార్లో భాగంగా ఉంటాయి. రూ.7వేల 383 కోట్లతో ఈ రెండు కారిడార్ లను ఏర్పాట వుతు న్నాయన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయడంలో ఈ కారిడార్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని బొగ్గును నేరుగా తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు చేరుకుంటుందని అన్నారు.ఈ కారిడార్ ద్వారా మొత్తం5లక్షల 700 కి.మీలు దూరం తగ్గుతుందన్నారు.తెలంగాణలో 19.7 కి.మీలు ఏపీలో 85.5 కి.మీల దూరం ఈ ప్రాజెక్టులో కవర్ అవుతుందన్నారు అశ్వినీ వైష్ణవ్.
గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితోపాటుగా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. కోస్తా ఏరియాలో తుఫాను ఏర్పడినప్పుడు ఈ కారిడార్ కు సరుకు రవాణాకు కీలకంగా మారుతుందన్నారు.
మరోవైపు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం మీదుగా ఈ లైన్ సాగుతుందన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధికి ఇది కీలకంగా మారనుందన్నారు. ఈ మార్గంలో టన్నెల్స్ నిర్మాణం ఉంటుందన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.