సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ :  కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

తెలుగు రాష్ట్రాల రైల్వే బడ్జెట్ ను  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్  ప్రకటించారు.  తెలంగాణకు రూ.5,337 కోట్లు..ఆంధ్రప్రదేశ్ కు రూ.9,417 కోట్లను కేంద్రం కేటాయించిందని వెల్లడించారు.  దేశ వ్యాప్తంగా  త్వరలోనే 15 నమో భారత్, 100 అమృత్ భారత్, 200 వందే భారత్ రైళ్లను తీసుకొస్తామని తెలిపారు. 

  తెలంగాణ నుంచి ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్ళు నడుస్తున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అశ్విని వైష్ణవ్.  తెలంగాణలో   1,324 కి.మీ మేర కవచ్  టెక్నాలజీ పనిచేస్తుంది. మరో 1026 కి.మీ  ఈ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. 2026 లోపు దేశ వ్యాప్తంగా కవచ్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ. 41,667 కోట్లు కొత్త లైన్ల కోసం, కాజీపేట అప్ గ్రేడేషన్ కోసం,ఇతరత్ర అభివృద్ధి కోసం కేటాయించామని తెలిపారు. మరి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయన్నారు.

ALSO READ | ఇదెప్పటి నుంచి..: కారు ఇన్సూరెన్స్ లేదా.. టోల్ గేట్ దగ్గర రూ. 2 వేల ఫైన్

 తెలంగాణలో ఇప్పటివరకు రైల్వే అభివృద్ధి కోసం రూ.41674 కోట్ల పెట్టుబడులు పెట్టామని చెప్పారు.  తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో రైల్వే కేటాయింపుల్లో యూపీఏ హయాంలో రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు అశ్విని వైష్ణవ్.