హైదరాబాద్ : కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కార్తీక మాసంలో కీసర గుట్ట ప్రాంతంలో వన భోజనాలు చేయడం ఇక్కడ అనవాయితీ. కీసర మేఘన హిల్స్ లే ఔట్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కార్తీక మాసం వనభోజన కార్యక్రమంలో కిషన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. కార్తీక దీపం వెలిగించారు. అనంతరం కల్చరల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.