317 జీవో సమస్యను పరిష్కరించండి

317 జీవో సమస్యను పరిష్కరించండి

హైదరాబాద్, వెలుగు: జీవో 317 సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరాయి.  సీపీఎస్ రద్దుతో పాటు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. గురువారం సెక్రటేరియెట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రిని టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, సత్యనారాయణ, టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు కలిశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సీపీఎస్ రద్దు,  పెండింగ్ డీఏల విడుదల, ఉద్యోగుల ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు, బదిలీలు, ఉద్యోగుల పెండింగ్ బిల్స్ వంటి సమస్యలను సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకురావాలన్నారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయించాలని.. ఐఆర్ ను 5 శాతం నుంచి 20 శాతం వరకు పెంచాలని కోరారు. అంతకుముందు, నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్ లో ప్రొఫెసర్ కోదండరాంను టీఎన్జీవో, టీజీవో నేతలు కలిసి ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి , ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అంశంలో అనుసంధాన కర్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.