
ఏపీలో కొవిడ్ సమాచారం తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్ కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోనా పరిస్థితులపై సమాచారం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. కరోనాపై సమాచారమే కాకుండా…సహాయం కూడా పొందవచ్చని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.