పిల్లల ఏడుపు ఇంట్లోకి రావాలని ఎవరూ ఎదురుచూడరు. కానీ ఓ తల్లిదండ్రులు మాత్రం కొన్నేళ్ల నుంచి ఆ సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కుటుంబంలోకి కొత్త అతిథికి స్వాగతం పలికేందుకు ఇంటిని పూలతో అలంకరించారు. అందుకోసం కీర్తన, భజన కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు నోట్ల కట్టతో నింపేశారు. 100 డాలర్ల నోట్ల వర్షం కురిసిందంటే నమ్మశక్యం కాదు. ముఖం తప్ప బాడీ మొత్తం నోట్లతో నింపేశారు. వారు దాన్ని ప్రేమ అంటుంటే.. చుట్టుపక్కల ప్రజలు మాత్రం దాన్ని మూర్ఖత్వం అంటున్నారు
దీనికి సంబంధించిన ఓ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొన్ని నిమిషాల క్రితమే పుట్టిన బిడ్డ ఊయలలో పడుకుని ఉంది. అప్పుడే ఇంటి నుంచి వచ్చిన ఓ వ్యక్తి చిన్నారిపై నోట్ల వర్షం కురిపించాడు. అతను పిల్లాడి శరీరంపై ఒకదాని తర్వాత ఒకటి చాలా నోట్లను విసిరాడు. దాంతో శిశువు శరీరం మొత్తం నోట్లతో కప్పబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 27 వేల మంది లైక్‌లు వచ్చాయి. దాదాపు 2600 మంది రీట్వీట్ చేశారు.
టాయిలెట్‌లో కంటే నోట్స్‌లో ఎక్కువ బ్యాక్టీరియా
ఈ వీడియోను చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ రూపంలో వారు అలా కరెన్సీ నోట్లను కురిపించడం కరెక్ట్ కాదని మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాని వల్ల నోట్లకు ఉన్న బాక్టీరియా బిడ్డకు వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. టైమ్‌లోని ఒక నివేదిక ప్రకారం, టాయిలెట్‌ల కంటే కాగితంతో తయారు చేయబడిన నోట్లలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఇలా చేస్తే నవజాత శిశువు జీవితానికి ప్రమాదంగా మారుతుంది.
కావాలంటే డస్ట్‌బిన్‌లో వేయండి
కొంతమంది ఇంటర్నెట్ యూజర్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. హాస్యనటుడు జేమ్స్ ఆండ్రీ జెఫెర్సన్ జూనియర్ కోపంగా ఇలా వ్రాశాడు, "బిడ్డ పుట్టి 28 నిమిషాల కంటే ఎక్కువ సమయం కాలేదు.. మీరు శిశువుపై మురికి డబ్బును కురిపిస్తున్నారు." కావాలంటే వాటిని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేయండి. లేదా మురికి ఉన్న రుమాలుని తెచ్చి ముఖం మీద వేయండి అని రాసుకొచ్చారు. ఇంకొకరేమో నవజాత శిశువును ఇలా బ్యాక్టీరియా దుప్పటితో కప్పేశాడని కామెంట్ చేయగా.. పిల్లవాడు జబ్బు పడకూడదని ఆశిస్తున్నానని మరొకరు తెలిపారు.- పిల్లలపైకి ఇలా డబ్బు విసిరేయడం కంటే వారి పేరు మీద పెట్టుబడి పెట్టడం మంచిదంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు.
https://twitter.com/uncensoredpromo/status/1650451194932862976