యాదాద్రి, వెలుగు : సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఐక్య కార్యాచరణ జిల్లా కమిటీ చైర్మన్మందడి ఉపేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం యాదాద్రి జిల్లా భువనగిరిలో సీపీఎస్‌పై ఉద్యోగులు నల్లబ్యాడ్డీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. వాన కురుస్తున్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ కారణంగా ఉద్యోగులకు నష్టం జరుగుతోందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. పాత పెన్షన్విధానం పునరుద్ధరించేంతవరకూ ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో, టీజీవో, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సంఘం నాయకులు డి.భగత్, ఎండీ ఖదీర్, ముక్కెర్ల యాదయ్య, మెతుకు సైదులు, చిత్తరంజన్ రెడ్డి, కవిత, అరుణమ్మ, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఆనందం, జీవీ రమణారావు, జి.బాలయ్య, పెండెం శ్రీను, విజయ్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, బాలమణి, కౌశిక్, పి.సుదర్శన్ రెడ్డి, డి.నరేశ్, వెంకన్న పాల్గొన్నారు.