విమానం ఇంజిన్‌లో మంటలు.. వీడియో తీసి పోస్ట్ చేసిన ప్రయాణికుడు

విమానం ఇంజిన్‌లో మంటలు.. వీడియో తీసి పోస్ట్ చేసిన ప్రయాణికుడు

విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలంటుకున్నాయి. కానీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటన అమెరికాలో శనివారం జరిగింది. యునిటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం శనివారం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోనోలులుకు బయలుదేరింది. ఆ విమానంలో 231 మంది ప్రయాణికులు మరియు 10 మంది సిబ్బంది ఉన్నారు.

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. అలర్ట్ అయిన విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతి కోరుతూ ఏటీసీకి సమాచారమిచ్చారు. పైలట్ తగు జాగ్రత్తలు తీసుకొని విమానాన్ని ల్యాండ్ చేశాడు. అయితే ఫెయిలైన ఇంజిన్ యొక్క విడిభాగాలు మాత్రం కొలరాడో పట్టణంలోని ఇళ్ల మధ్య పడ్డాయి. కాగా.. విమానం ఎటువంటి క్రాష్‌కు గురికాకుండా ల్యాండవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాద వీడియోను అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో పోస్ట్ చేసిన ఎనిమిది గంటల్లోనే 60 లక్షలకు పైగా వీక్షించారు.

For More News..

టీమిండియాలోకి ముగ్గురు కొత్తోళ్లు..

పెట్రో రేట్ల గురించి కేంద్ర, రాష్ట్రాలు మాట్లాడుకోవాలి

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన నవోమి ఒసాకా