- మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న
ఆర్మూర్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని బుధవారం దళిత సంఘాల నాయకులు హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఉన్న లెదర్ పార్క్‌లు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. పదేళ్లుగా రాష్ట్రంలో లెదర్ పార్క్ లు నిరుపయోగంగాగానే ఉన్నాయని, వాటికి కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయన్నారు.
ఆర్మూర్ లో పక్కా భవనంలో ఉన్న లెదర్ పార్క్‌ను వినియోగంలోకి తెస్తే నిరుపేదలకు ఆసరాగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లెదర్ పార్క్‌పై చర్చించి పార్క్ లను వినియోగంలోకి వచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.