ప్రపంచ క్రికెట్ లో అమెరికా తన ఉనికిని చాటుకుంటుంది. క్రికెట్ లో చిన్నగా తమ పాగా వేస్తుంది. టీ20 వరల్డ్ కప్ కు ఆతిధ్యమిచ్చి అందరి దృష్టిలో పడిన ఆ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ పై సిరీస్ గెలిచి సంచలనం సృష్టించింది. తొలి మ్యాచ్ లో గెలుపును గాలివాటం అనుకున్న వారికి గట్టి షాక్ ఇచ్చింది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ బంగ్లాదేశ్ సీనియర్ టీంపై గెలిచి వరల్డ్ కప్ ముందు ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది.
వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ తో మూడు టీ20 సిరీస్ లో భాగంగా అమెరికా తొలి మ్యాచ్ గెలిచి సంచలనం సృష్టించగా.. రెండో టీ20 మ్యాచ్ లోనూ గెలిచి చరిత్ర సృష్టించింది. గురువారం (మే 23) జరిగిన రెండో టీ20లో 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్(45), ఆరోన్ జోన్స్(35) పరుగులతో రాణించారు.
Also Read:ఆసీస్ క్రికెటర్లను సంప్రదించలేదు.. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై జైషా కీలక వ్యాఖ్యలు
145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా..తొలి 10 ఓవర్లలో 2 వికెట్లను 76 పరుగులు చేసి లక్ష్యం దిశగా వెళ్ళింది. అయితే ఈ దశలో అనూహ్యంగా బంగ్లా కుప్పకూలింది. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో అమెరికా బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ సిరీస్ తో అమెరికా పూర్తి సభ్యదేశంపై తొలి సిరీస్ విజయం సాధించి చరిత్ర నెలకొల్పింది.
USA BEAT BANGLADESH AGAIN TO CLINCH THE SERIES! https://t.co/4hbN5N9uRi | #USAvBAN pic.twitter.com/Xsq9S06qto
— ESPNcricinfo (@ESPNcricinfo) May 23, 2024