యునైటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ యూనిట్ CEO అయిన బ్రియాన్ థాంప్సన్ గుర్తు తెలియన వ్యక్తి కాల్చి చంపారు. బుధవారం (డిసెంబర్ 4) ఉదయం USలోని మాన్‌హాటన్‌లోని హిల్టన్ హోటల్ వెలుపల థామ్సన్ పై తుపాకీతో నిందితుడు కాల్పులు జరిపారు. అతిదగ్గర నుంచి కాల్పులు జరపడంతో థామ్సన్ అక్కడికక్కడే చనిపోయాడు.
యునైటెడ్‌హెల్త్‌కేర్ వార్షిక పెట్టుబడిదారుల సమావేశానికి హాజరయ్యేందుకు న్యూయార్క్ హిల్టన్ హోటల్ కు థామ్సన్ వచ్చాడు. నడుచుకుంటూ వస్తుండగా థాంప్సన్ పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని స్థానిక పోలీసులు చెప్పారు. సైకిల్ పై వచ్చిన దుండగులు థామ్సన్ పై కాల్పులు జరిపి పరారయ్యాడని చెబుతున్నారు. ఈ కాల్పుల్లో 55 యేళ్ల థామ్సన్ ఛాతిపై తీవ్రమైన గాయాలయ్యాయి.
ALSO READ : బందీలను విడువకుంటే నరకం చూపిస్త.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
క్రిటికల్ కండిషన్ లో ఉన్న థామ్సన్ ను మౌంట్ సినాయ్ వెస్ట్ కు తరలించారు. అప్పటికే థామ్సన్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పరారీ లో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.