హైదరాబాద్, వెలుగు: యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హైదరాబాద్‌లో ఐదు బ్రాంచులను ఓపెన్ చేసింది. దిల్సుఖ్నగర్, ఎస్ఆర్ నగర్, మౌలాలి, సుచిత్ర క్రాస్‌రోడ్, కూకట్‌పల్లిలో వీటిని ఏర్పాటు చేసింది. రానున్న నెలల్లో మరిన్ని చోట్ల బ్రాంచులను ఓపెన్ చేస్తామని బ్యాంక్ సీఈఓ ఇంద్రజిత్ కామోత్ర అన్నారు. సీనియర్ సిటిజన్స్‌కు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడాదికి 9.50 శాతం వడ్డీ ఇస్తున్నామని, రిటైల్ ఇన్వెస్టర్లకు 9.00 శాతం ఆఫర్ చేస్తున్నామని చెప్పారు.
రూ.లక్ష నుంచి రూ.5 లక్షల లోపు ఉన్న సేవింగ్స్ అకౌంట్లకు 7.25 శాతం వడ్డీని, రూ.5 లక్షలకు పైన ఉన్న సేవింగ్స్ అకౌంట్లకు 7.50 శాతం వడ్డీని ఇస్తున్నామని వివరించారు. తక్కువ రేట్లకే లాకర్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నామని కామోత్ర పేర్కొన్నారు.