
ఓయూ, వెలుగు: కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్టులను ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీల బంద్‌కు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల అసోసియేషన్ పిలుపునిచ్చింది. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడికి వివిధ యూనివర్సిటీల నుంచి భారీగా తరలివచ్చిన కాంట్రాక్ట్ లెక్చరర్లను పోలీసులు తెల్లవారుజామునే అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు గృహ నిర్బంధాలు చేశారన్నారు. ప్రశ్నించే గొంతుకలు ఉండాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తమను అరెస్టు చేయడం బాధాకరమన్నారు.