బీఎస్సీ అలైడ్ హెల్త్  సైన్సెస్  ..  డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు

వరంగల్​సిటీ, వెలుగు : బీఎస్సీ అలైడ్​ హెల్త్  సైన్సెస్  డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ  ప్రకటన  విడుదల చేసింది. బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్, కార్డియో  వాసిక్యులర్​ టెక్నాలజీ, బీఎస్సీ రెనాల్ డయాలిసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్  టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్  టెక్నాలజీ

బీఎస్సీ రేడియాలజీ అండ్​ ఇమేజింగ్  టెక్నాలజీ, బీఎస్సీ ఆడియోలజీ, స్పీచ్ థెరపీ టెక్నాలజీ,  బీఎస్సీ మెడికల్ రికార్డ్స్​ సైన్సెస్, బీఎస్సీ న్యూక్లియర్  మెడిసిన్, బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ  కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు. ఈ నెల  27 నుంచి నవంబర్ 2  వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత మెరిట్ లిస్ట్​ రిలీజ్​చేస్తారు. వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్​సైట్​ చూడాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు