వరంగల్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. నగరంలోని కీర్తి నగర్ లో తల్లికొడుకులపై కొందరు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన తల్లికొడుకులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే..ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. జగిత్యాల జిల్లాలోనూ కత్తిపోట్లు కలకలం రేపాయి. కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో ఆస్థి తగాదాలతో రాజేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. రాజేష్ కు ఇద్దరు బాబాయిలతో ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవలో రాజేష్ పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.