గుర్తుతెలియని డెడ్​బాడీలు లభ్యం

గుర్తుతెలియని డెడ్​బాడీలు లభ్యం

మేడ్చల్/ ఇబ్రహీంపట్నం, వెలుగు:  మేడ్చల్ కండ్లకోయలోని ఎగ్జిట్ సిక్స్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మేడ్చల్​ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల చెరువులో  గుర్తు తెలియని యువకుడి డెడ్‌ బాడీ బయటపడింది.  మృతుడి వయస్సు సుమారు 25 ఏండ్లు ఉంటుందని,  కుడి చేతి మీద అ అక్షరం పచ్చబొట్టు వేయించుకున్నట్లు ఉందని ఆదిభట్ల సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నట్టు చెప్పారు.