టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వచ్చిన రెండో మూవీ బిజినెస్‌మెన్(Businessman). పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్టు తరువాత వచ్చిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముంబై క్రైమ్ వరల్డ్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. ఇక సినిమాలో సూర్య భాయ్ మహేష్ బాబు పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్స్ సీక్వెన్సెస్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. అందుకే ఇప్పటికి ఈ సినిమా టీవీలో వచ్చినా అతుక్కుపోయి మరీ చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు.
అయితే ఈ సినిమా గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాకు డైరెక్టర్ పూరి జగన్నాధ్ అని తెలుసు కానీ, కథ మాత్రం ఆయనది కాదట. అవును, బిజినెస్‌మెన్ కొర్ పాయింట్ రామ్ గోపాల్ వర్మ ఇచ్చారట. రక్త చరిత్ర సినిమా చేస్తున్న సమయంలో వర్మ తన శిష్యుడు పూరికి ఈ పాయింట్ చెప్పాడట. ప్రస్తుతం ముంబైలో డాన్ ఎవరు లేడని, ఒకవేళ కొత్తవ్యక్తి క్రైమ్ వరల్డ్ లో అడుగుపెడితే ఎలా ఉంటుంది అనే పాయింట్ డెవలప్ చేయమని చెప్పాడట.
నిజానికి ఈ కథను ముందుగా తమిళ స్టార్ సూర్య కోసం అనుకున్నారట వర్మ. కథ వినిపించగా.. సూర్య కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. అయితే.. అప్పటికే పలు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉండటంతో సూర్య ఈ సినిమా చేయలేకపోయాడట. అదే కథతో మహేష్ దగ్గరకు వెల్లాగా.. పోకిరి లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పూరి అడగడంతో కథ వినకుండానే ఓకే చేసేసాడట మహేష్.
ఇక పూరి స్టైల్ ఫాస్ట్ మేకింగ్ లో కేవలం 74 రోజుల్లోనే బిజినెస్‌మెన్ షూటింగ్ పూర్తిచేశారట. ఇక 2013 సంక్రాంతికి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమాకు ముందు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. కానీ, ఆ టాక్ ను సైతం ఓవర్ కం చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.90 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలా సూర్య కెరీర్ లో పడాల్సిన బిజినెస్‌మెన్ మూవీ మహేష్ కు బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.