అంతర్యుద్ధంలో అట్టుడుకున్న యెమెన్లో ఐక్యరాజ్య సమితి సిబ్బంది అపహరణకు గురయ్యారు. ఓ మిషన్లో భాగంగా యెమెన్కు వెళ్లిన యూఎన్ఓ సిబ్బందిలో ఐదుగురిని కిడ్నాప్ చేశారు. వారంతా దక్షిణ యెమెన్లో పని ముగించుకుని అడెన్కు తిరిగి వస్తుండగా దుండగులు కిడ్నాప్ చేసినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. స్థానిక అధికారుల సాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు యెమెన్లో యూఎన్ఓ అధికారి రస్సెల్ గీకీ తెలిపారు.
యెమెన్‌లో 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూప్‌కి మధ్య యుద్ధం జరుగుతోంది. 2015లో యెమెన్ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పటి నుంచి యెమెన్ అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 10వేల మందికిపైగా చనిపోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
మరిన్ని వార్తల కోసం..