తిరుమలలో లోయలోకి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

తిరుమలలో లోయలోకి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

కలియుగ వైకుంఠం తిరుమల గత కొద్దిరోజులుగా వివాదాలకు నెలవుగా మారుతోంది.తిరుమలలో తరచూ అపశ్రుతులు చోటు చేసుకుంటున్న క్రమంలో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుమలలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.. 

బుధవారం ( మార్చి 5, 2025 ) అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న అక్కగార్ల ఆలయం దగ్గర అవ్వాచారి కోన లోయలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి గురించి వివరాలు తెలియాల్సి ఉంది ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు,పోలీసులు. రెస్క్యూ బృందం లోయలోకి దిగి వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Also Read:-జగన్కు ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలక ప్రకటన..