తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లుగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. తనను, తన కుంటుంబాన్ని, ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లుగా రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోతో పాటుగా నగర పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను విడుదల చేశారు.
అయితే తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం కొత్తేమీ కాదన్న రాజాసింగ్.. వాటిపై తాను సీపీకి, డీజీపీకి ఫిర్యాదుచేసినా.. వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్ లో సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడిన ఆ వ్యక్తి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించినట్లుగా రాజాసింగ్ తెలిపారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడిన తమ సంకల్పం మాత్రం అఖండ హిందూ రాష్ట్ర సాధనే అని చెప్పారు.
Also Read :- కూన శ్రీశైలం గౌడ్‌పై ఎమ్మెల్యే వివేకానంద దాడి
ఇటీవల రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను బీజేపీ అధిష్టానం ఎత్తివేసింది. ఓ వివాదాస్పద కామెంట్ల నేపథ్యంలో రాజాసింగ్ పైన పార్టీ సస్పెన్షన్ విధించింది. తాజాగా దానిని ఎత్తివేసిన అధిష్టానం గోషామహల్ నుంచి మురోసారి టికెట్ కేటాయించింది.