ఏటీఎం కార్డు మార్చి.. రూ. 75 వేలు చోరీ

కాశీబుగ్గ, వెలుగు : డిపాజిట్‌‌ మెషీన్‌‌లో డబ్బులు వేస్తానని చెప్పి ఏటీఎం కార్డు మార్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి రూ. 75 వేలు డ్రా చేసుకొని పరార్‌‌ అయ్యాడు. ఈ ఘటన వరంగల్‌‌లో బుధవారం వెలుగు చూసింది. వరంగల్‌‌ నగరానికి చెందిన మహ్మద్‌‌ యాజ్‌‌ మహర్‌‌ బుధవారం తన అకౌంట్‌‌లో రూ. 98 వేలను డిపాజిట్‌‌ చేసేందుకు ఎంజీఎం హాస్పిటల్‌‌ వద్ద గల ఎస్‌‌బీఐ ఏటీఎం వద్దకు వెళ్లాడు. 

మహ్మద్‌‌ యాజ్‌‌ మహర్‌‌ డబ్బులు డిపాజిట్‌‌ చేస్తుండగా అతడి వెనుకే ఉన్న ఓ వ్యక్తి తాను డబ్బులు డిపాజిట్‌‌ చేసి ఇస్తానంటూ చెప్పి కార్డు తీసుకున్నాడు. డబ్బులను డిపాజిట్‌‌ చేసిన తర్వాత ఏటీఎం కార్డు మార్చి ఇచ్చాడు. బాధితుడు ఇంటికి వెళ్లే సరికి అతడి అకౌంట్‌‌ నుంచి రూ. 75 వేలు డ్రా అయినట్లు మెసేజ్‌‌ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన మహ్మద్‌‌ యాజ్‌‌ మహర్‌‌ వెంటనే మట్వాడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.