రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో హల్ చల్ చేశారు. మే 21వ తేదీ ఆదివారం రాత్రి సమయంలో శంకర్ పల్లి జన్వాడ గెట్ వద్ద కత్తులతో తిరుగుతున్న వారిని గ్రామస్తులు గుర్తించారు. వెంటనే వారిని వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దుండగుల వద్ద నుండి కత్తులు, ఇనుప రాడ్లు లభ్యమైయ్యాయి. వీరు సుమారు 10 మంది గ్యాంగ్ గా వచ్చినట్లు తెలుస్తోంది.
వీరిలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా.. మరి కొందరు పరారిలో ఉన్నారు. వీరంతా కిడ్నాప్ కోసం వచ్చారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అనుమానితులు కిషన్ బాగ్ కి చెందిన సిరాజ్ సింగ్, పవన్ గా గుర్తించారు పోలీసులు. అయితే సదరు వ్యక్తులు ఫైనాన్స్ రికవరీ కోసం వచ్చుంటారని పోలీసులు అంటున్నారు. అనుమానితులను పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.