మహబూబాబాద్అర్బన్, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 29 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బయ్యారం మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో ఎస్ బీఐను ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం సెంటర్ లోకి చొరబడ్డారు.
ఏటీఎం మెషీన్ ను ధ్వంసం చేసి డబ్బులు తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం వినియోగదారులు ఏటీఎం వద్దకు రాగా మెషీన్ ధ్వంసం అయి కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు, బ్యాంక్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఉపేందర్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.