
వలస కూలీలను బెదిరించి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు వసూలు చేసిన ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి శివాలయం వద్ద ఈ ఘటన జరగింది. అత్తాపూర్ కుమ్మరి బస్తీకి చెందిన వెంకటయ్య, సిద్దులు వలస కూలీలు. స్థానికంగా పని చేస్తూ జీవిస్తున్నారు.
వారిని ఇద్దరు దుండగులు కత్తితో బెదిరించారు. వాటిని చూసి కూలీలు భయపడ్డారు. అనంతరం దుండగులు వారి నుంచి రూ.12 వేలు, 2 సెల్ఫోన్లను లాక్కెళ్లారు. తమను బెదిరించి దోచుకున్నారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దోపిడీకి పాల్పడ్డ వారు ప్రేమ్ సింగ్, గిడ్డ సింగ్‌గా గుర్తించి వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.