దంతేరాస్ పండుగను నవంబర్ 10న శుక్రవారం మధ్యాహ్నం 12:35 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నవంబర్ 11 శనివారం మధ్యాహ్నం 1:57 గంటలకు ముగుస్తుంది. ధంతేరాస్ రోజున ప్రదోష కాలంలో పూజలు జరుగుతాయి. కాబట్టి నవంబర్ 10న ధంతేరాస్ జరుపుకుంటారు. అయితే దంతేరాస్ త్రయోదశి ఘడియలు శనివారం కూడా ఉన్నాయి. అంటే ఆరోజును శనిత్రయోదశిగా పరిగణిస్తారు. ధనత్రయోదశి పూజ, శనివారం త్రయోదశి ఉండటంచేత శని త్రయోదశి కూడా వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్తలు తెలిపారు.
11 నవంబర్ 2023 శనివారం త్రయోదశి తిథి రోజునే ధనత్రయోదశి పూజ, అదేరోజు శని త్రయోదశి కూడా వచ్చిందని పంచాంగకర్తలు తెలిపారు. ధృక్ సిద్ధాంత గణితం ఆధారంగా 11 నవంబర్ 2023 స్థిరవారం త్రయోదశి మధ్యాహ్నం 1 గం॥ వరకు ఉండటంచేత ఈరోజు ధనత్రయోదశి అలాగే శని త్రయోదశి కూడా ఉన్నది.
ఏలినాటి శని, అర్జాష్టమశని, అష్టమశని, జాతకంలో శని దోషాలు ఉన్నటువంటి వారు శని మహర్ధశ, శని అంతర్దశ వలన శని ప్రభావానికి ఇబ్బందికి గురైనటువంటి వారికి శని త్రయోదశి చాలా విశేషమైన రోజని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. ఈ శని ప్రతయోదశి సందర్భంగా ఎవరైతే విశేషంగా ఆరోజు నవగ్రహ ఆలయాలను దర్శించి శనికి తైలాభిషేకం వంటివి చేసుకొని శనికి సంబంధించినటువంటి శాంతులు దానాలు చేసుకుంటారో వారికి శనిగ్రహానికి సంబంధించిన పీడలు, ఈతిబాధలు తొలగుతాయి.
11 నవంబర్ 2023 పంచాంగరీత్యా మకర, కుంభ మీనరాశులవారు, కర్కాటక మరియు వృశ్చిక రాశులవారు శనిత్రయోదశి రోజున ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో నవగ్రహ ఆలయాలను దర్శించడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని సోత్రం వంటివి పఠించడం, నువ్వులు వంటివి దానం ఇచ్చుకోవడం వల్ల వారికి ఏలినాటి శని, అర్జాష్టమశని, అష్టమశని వంటి శనిగ్రహ బాధలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మందపల్లి, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరునల్లార్ మరియు మహారాష్ట్రలో శని శింగపూర్ వంటి క్షేత్రాలను అవకాశం కొద్ది దర్శించుకొని నువ్వుల నూనెతో అభిషేకం వంటివి చేసుకున్నట్లయితే మరింత శభఫలితాలు కలుగుతాయట.
ఈరోజు ధన త్రయోదశి ఉండటంచేత నవగ్రహ ఆలయాలు దర్శించి శనిని ఆరాధించడం వలన జాతక రీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయంటున్నారు పండితులు. అయితే నవగ్రహ ఆలయ దర్శనం శని పూజ వంటివి ఆచరించాక ఇంటియందు కాని ఆలయాల్లో కాని లక్ష్మీదేవిని పూజించి దీపారాధన వంటివి చేసినట్లయితే విశేషంగా ప్రదోష కాలంలో సాయంత్ర సమయంలో ధనత్రయోదశి తిధి ఉన్నటువంటి సమయంలో లక్షీపూజలు ఆచరించినటువంటివారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు అంటున్నారు.