హర్యానా ప్రభుత్వం కొత్త స్కీమ్ ... పెళ్లికాని వారికి పెన్షన్

హర్యానా ప్రభుత్వం కొత్త స్కీమ్ పై సమాలచోనలు చేస్తోంది. పెళ్లి కాని వారికి పెన్షన్ అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు  వయసున్న అవివాహితులు దీనికి అర్హులు.  పురుషులకూ కూడా పెన్షన్ అందించనున్నారు.  ఏటా 1.80లక్షల ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్  అందనుంది. 

ఇటీవల 60 ఏళ్ల ఓ అవివాహిత తనకు పెన్షన్ ఇవ్వాలని ధరఖాస్తు పెట్టుకుంది. దీంతో ఈ స్కీమ్ ను నెల రోజుల్లో ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర సీఎం  మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే ఎంత పింఛను ఇస్తారన్నది స్పష్టం చేయలేదు.  

ALSO READ: గిరిజన గురుకుల స్కూల్లో పురుగుల బియ్యంతో అన్నం..కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు..

అలాగే వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో వృద్ధుల పింఛన్‌ను నెలకు రూ.3వేలకు పెంచుతామని చెప్పారు. కర్నాల్‌లోని కలంపుర గ్రామంలో 'జన్ సంవాద్' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ ప్రకటన చేశారు.    

జిల్లాలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని కర్నాల్‌ డిప్యూటీ కమిషనర్‌ను సీఎం  మనోహర్ లాల్ ఖట్టర్ఆదేశించారు. నేటి కాలంలో ఆన్‌లైన్‌లో 70 శాతం నుంచి 80 శాతం పనులు జరుగుతున్నాయని, అందుకే గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలందించాలని, ప్రతి గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చే తొలి జిల్లాగా కర్నాల్‌ నిలుస్తుందని సీఎం చెప్పారు.