![భార్యతో అసహజ శృంగారం నేరంకాదు..హైకోర్టు కీలక తీర్పు](https://static.v6velugu.com/uploads/2025/02/unnatural-sex-with-wife-without-consent-not-offence-chhattisgarh-high-court_kLdbeOpySJ.jpg)
వ్యక్తి తన భార్యతో అసహజ శృంగారం నేరం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.భార్య మేజర్ అయివుంటే భర్త చేసే ఏదైనా లైంగిక సంపర్కంలేదా లైంగిక చర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుతో అసహజ లైంగిక చర్యకు భార్య అనుమతి లేకపోవడం ప్రాముఖ్యతను కోల్పోతుంది.
భార్య ఇష్టం లేకున్నా భర్త ఆమె అసహజ శృంగారానికి చేస్తే ఆమెపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 కింద అత్యాచారం లేదా సెక్షన్ 377 కింద కేసు నమోదు చేయరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.భారతదేశంలో వైవాహిక అత్యాచారం శిక్షార్హమైన నేరం కానప్పటికీ, ఈ తీర్పు అసహజ లైంగిక సంబంధాన్ని శిక్షా పరిధి నుండి తప్పించింది.
ఐపీసీలోని సెక్షన్ 375, 376 ,377 సెక్షన్లను పరిశీలిస్తే..సవరించిన ఐపీసీ సెక్షన్ 375 ప్రభార్యాభర్తల మధ్య సెక్షన్ 377 ఐపీసీ కింద నేరంగా భావించలేం.. అలాంటి అత్యాచారాన్ని నిరూపించలేమని కోర్టు పేర్కొంది.
2017లో నమోదైన కేసు విచారణలో ఛత్తీస్ గఢ్ హైకోర్టు ఈ కీలక తీర్పునిచ్చింది. భర్త అసహ శృంగారం వల్లే మహిళ చనిపోయిందని ఆరోపణలో వ్యక్తిపై కేసును కోర్టు విచారించింది. ఈ కేసు వివరాల ప్రకారం..తన మల ద్వారంలో చేతులు జొప్పించారని..తనకు నొప్పిగా ఉందంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
విచారణలో భాగంగా చికిత్స కోసం ఆ మహిళనను ఆస్పత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు ఆమె చనిపోయింది. అయితే ఆమెకు పెరిటోనిటిస్, మలద్వారంచిల్లుల సమస్యలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఈ తీర్పుతో అసహజ లైంగిక చర్యకు భార్య అనుమతి లేకపోవడం ప్రాముఖ్యతను కోల్పోతుంది.