స్టార్ హీరో సినిమా పైరసీ చేసిన యువకుడు అరెస్ట్.. ట్విట్టర్ వేదికగా స్పందించిన హీరో..

స్టార్ హీరో సినిమా పైరసీ చేసిన యువకుడు అరెస్ట్.. ట్విట్టర్ వేదికగా స్పందించిన హీరో..

మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా గత ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మలయాళ దర్శకుడు హనీఫ్ దర్శకత్వం వహిగా ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ సింగ్, సిద్దిఖ్, జగదీశ్, ఇషాన్.. పలువురు మలయాళం స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు. 

యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో న్యూ ఇయర్ కానుకగా మార్కో సినిమాని పాన్ ఇండియా భాషల్లో డబ్బింగ్ చేసి జనవరి 1న రిలీజ్ చేశారు. దీంతో తెలుగు,హిందీ భాషల్లో డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ 100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. మలయాళ సినీ హిస్టరీలో ఏ రేటింగ్ మూవీస్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా మార్కో రికార్డ్ క్రియేట్ చేసింది. 

ALSO READ | ఇక నుంచి రామ్ చరణ్ ఆ సీన్స్ చెయ్యాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి: రాజమౌళి

అయితే మార్కో సినిమాని ఓ నెటిజన్ పైరసీ చేసి ఇంటర్ నెట్ లో రిలీజ్ చేశాడు. ఇదిగమనించిన ఈ సినిమా నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో  21 ఏళ్ల అక్విబ్ ఫనాన్ అనే వ్యక్తి మార్కో సినిమా పైరసీకి పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు. అక్విబ్ ఫనాన్ ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. దీంతో ఈ విషయంపై ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులోభాగంగా  'ఏం చేయాలో తెలియడం లేదు.. నిస్సహాయ స్థితిలో ఉన్నా'అంటూ ట్వీట్ చేశాడు.