మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా మలయాళంలో డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది. అయితే యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా కేరళలలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో మార్కో సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తన్నారు. ఇందులోభాగంగా జనవరి 1న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం మార్కో తెలుగు వెర్షన్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ విశేషాలు చూసినట్లయితే మొదటగా జీవితంలో మనల్ని అతడికంగా బాధించే విషయమేంటో తెలుసా... మనకి ఇష్టమైన వాళ్ళని మన కళ్లెదుటే చిత్ర హింసలుపెట్టి చంపటం అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. ఇందులో రక్తంతో తడిసిన తెల్ల పావురం కర్రపై నిలబడి ఉండే విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక ఆ తర్వాత కొన్ని డైలాగ్స్ ఉన్నప్పటికీ యాక్షన్ విజువల్స్ బ్లడ్ తో ఉన్నాయి. దీంతో స్టోరీ మొత్తం యాక్షన్ సీన్స్ తప్ప ఎమోషన్స్ పెద్దగా ఎలాంట్లు తెలుస్తోంది. విజువల్స్ కి తగ్గట్టుగానే మ్యూజిక్ డైరెక్టర్ రవి భాసురుర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఓవరాల్ గ యాక్షన్స సీక్వెన్స్ లో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
అయితే డిసెంబర్ 20న మలయాళంలో రిలీజయిన మార్కో సినిమా వారంలో రోజుల్లోనే రూ.75 కోట్లు కలెక్ట్ చేసింది. మార్కో సినిమాలోని యాక్షన్స్ ఎక్కువగా కేజీఎఫ్ సినిమాని తలపిస్తున్నాయి. దీంతో తెలుగు ఆడియన్స్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే యుక్తి తరేజా హీరోయిన్ గా నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ దుహన్ సింగ్ విలన్ గా నటించాడు.మలయాళ ప్రముఖ సినీ నిర్మాత షరీఫ్ మహమ్మద్ క్యూబ్స్ ఎంటర్టైంన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. తెలుగులో ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటెడ్ సంస్థ ఎన్వీఆర్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది.