వరంగల్‌‌‌‌లోని ఏవీవీ స్కూల్‌‌‌‌ అండ్‌‌‌‌ డిగ్రీ కాలేజీలో అపూర్వ సమ్మేళనాలు

కాశీబుగ్గ/తొర్రూరు/ధర్మసాగర్‌‌‌‌ (వేలేరు), వెలుగు : వరంగల్‌‌‌‌ నగరంలోని ఏవీవీ స్కూల్‌‌‌‌ అండ్‌‌‌‌ డిగ్రీ కాలేజీలో 1985 -– 86లో టెన్త్‌‌‌‌ చదివిన స్టూడెంట్లు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్​ ఏ.భుజేందర్‌‌‌‌రెడ్డి, చంద్ర శ్రీకాంత్, సంజీవ, వాసుదేవులు, రాజేశ్వర్, ఓంప్రకాశ్, విశ్వేశ్వర్‌‌‌‌రావు, కృష్ణ పాల్గొన్నారు.

అలాగే మహబూబాబాద్‌‌‌‌ జిల్లా తొర్రూరు మండలంలోని చర్లపాలెం హైస్కూల్‌‌‌‌లో 2001– 02లో టెన్త్‌‌‌‌ చదివిన స్టూడెంట్లు ఆదివారం కలుసుకొని ఆనందంగా గడిపారు. తమకు చదువు చెప్పిన టీచర్లను సన్మానించి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్రెండ్స్‌‌‌‌కు ర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో  హెచ్‌‌‌‌ఎం బుచ్చయ్య, జినుగ మోహన్‌‌‌‌రెడ్డి, తండ ప్రభాకర్, కేశవరెడ్డి, బంధు నారాయణ, శ్యాంసుందర్, రామకృష్ణ, సూరి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

హనుమకొండ జిల్లా వేలేరు జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌లో 1988–--89లో టెన్త్‌‌‌‌ చదివిన స్టూడెంట్లు సైతం ఆదివారం పూర్వ  విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. అనంతరం టీచర్లను సన్మానించారు. హెచ్‌‌‌‌ఎం గౌరిశెట్టి రాజన్న, ఈశ్వరయ్య, సి.శాంతయ్య, వి.మల్లయ్య, ఎం.ఆగయ్య, వి.వెంకట్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.