IND vs AUS 2nd Test: రోహిత్ తప్పుకో.. జట్టులో నీవు అనర్హుడివి: అభిమానులు

IND vs AUS 2nd Test: రోహిత్ తప్పుకో.. జట్టులో నీవు అనర్హుడివి: అభిమానులు

6 & 5, 23 & 8, 2 & 52, 0 & 8, 18 & 11, 3 & 0*.. చివరి ఆరు టెస్టుల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పరుగులివి. సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న హిట్‌మ్యాన్ పరుగుల వేటలో వెనుకబడి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కుర్ర క్రికెటర్లు సెంచరీల మీద సెంచరీలు చేస్తుంటే.. తాను మాత్రం క్రీజులో నిలబడటానికే నానా అవస్థలు పడుతున్నాడు. కీలక మ్యాచ్‌ల్లోనూ అదే ఆట తీరు. అనవరసపు షాట్లకు పోయి వికెట్ పారేసుకుంటున్నాడు. ఇంత విఫలమవుతున్నా అతను జట్టులో ఉన్నాడంటే అందుకు కారణం.. నాయకుడు అన్న పేరు మాత్రమేనని అభిమానులు అంటున్నారు. 

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ 3 పరుగులకే వెనుదిరిగాడు. 81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హిట్‌మ్యాన్ తన వికెట్‌తో మరింత కష్టాల్లోకి నెట్టాడు. అభిమానులు దీన్ని పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు హిట్‌మ్యాన్ పేలవ ప్రదర్శనపై నోరు మెదపనప్పటికీ, ఇప్పుడు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. తనకు తానుగా జట్టు నుంచి తప్పుకోవాలని రోహిత్‌కు సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Also Read:-ఇటలీ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్..

తడిబడిన భారత్

అడిలైడ్‌ టెస్టులో భారత బ్యాటర్లు తడబట్టారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు పెవిలియన్ కు క్యూ కట్టారు. మొత్తానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 180 ప‌రుగుల‌కు ఆలౌటైంది. స్టార్క్ 48 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. నితీష్ రెడ్డి (42), కేఎల్ రాహుల్ (37), గిల్ (31) పరుగులు చేశారు.