ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభమైంది. దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా జరుగుతున్న ఈ వేలంలో మొదటి గంటలో పలువురు స్టార్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు మొండి చేయి చూపించారు. వీరిలో ఇద్దరు విదేశీ స్టార్లతో పాటు మరో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
2 కోట్ల ప్రాధమిక ధరతో వేలల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్, సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రైలీ రూసో అమ్ముడుపోలేదు. ఏ ఫ్రాంచైజీ వీరిపై ఆసక్తి చూపించలేదు. రూసో ఐపీఎల్ 2023 లో ఢిల్లీ తరపున ఆడిన ఆడగా.. స్మిత్ వరుసగా రెండోసారి అమ్ముడుపోలేదు. స్మిత్ గతంలో రాజస్థాన్ రాయల్స్, పూణే వారియర్స్ తరపున కెప్టెన్ గా చేసిన సంగతి తెలిసిందే. తొలి రౌండ్ లో వీరికి నిరాశ ఎదురు కాగా.. ఆఖరి రౌండ్ లో వీరేమైనా అమ్ముడుపోతారేమో చూడాలి.
భారత ప్లేయర్ల విషయానికి వస్తే మనీష్ పాండే, కరుణ్ నాయర్ కు నిరాశ తప్పలేదు. పేలవ ఫామ్ లో ఉండడం.. ఐపీఎల్ 2023 లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఫ్రాంచైజీలు వీరిని పక్కన పెట్టేసారు. గతంలో మనీష్ పాండే సన్ రైజర్స్, ఢిల్లీ తరపున ఆడితే, కరుణ నాయర్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడారు.
తొలి రౌండ్ లో అమ్ముడుపోని అంతర్జాతీయ స్టార్లు వీరే
- రిలీ రోసోవ్
- కరుణ్ నాయర్
- స్టీవ్ స్మిత్
- మనీష్ పాండే
- ఫిలిప్ సాల్ట్
- కుసాల్ మెండిస్
- జోష్ ఇంగ్లిస్
- లాకీ ఫెర్గూసన్
- వకార్ సలాంఖీల్
- ఆదిల్ రషీద్
- అకేల్ హోసేన్
- ఇష్ సోధి
- తబ్రైజ్ షమ్సీ
- ముజీబ్ ఉర్ రెహమాన్