మణుగూరులో అడ్డూఅదుపులేని ఆక్రమణలు

మణుగూరులో అడ్డూఅదుపులేని ఆక్రమణలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వర్షాల కారణంగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత మణుగూరు పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మణుగూరు పట్టణం గుండా వెళ్లే కట్టువాగు ఆక్రమణలతో కుచించుకుపోవడంతో వరద నీరు పట్టణాన్ని ముంచెత్తింది. సింగారం చెరువు అలుగు ప్రాంతంలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మరో వైపు సింగరేణి ఓబీల్లోంచి వచ్చే వరద మణుగూరు విరుచుకుపడడంతో కాలనీలు నీట మునిగాయి. 

కోడిపుంజుల వాగు ఉధృతితో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వరద నీరంతా ఇండ్లలోకి చేరింది. వరద కారణంగా సుమారు 500 నుంచి 700 ఇండ్లలో రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. చుంచుపల్లి మండలం విద్యానగర్‌‌‌‌ పంచాయతీలో హైవేకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీంతో నీరు సాఫీగా వెళ్లడం లేదు. మరో వైపు కొందరు వ్యక్తులు డ్రైనేజీలను ఆక్రమించుకొని ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. చెరువుల బఫర్‌‌‌‌ జోన్లలోనూ నిర్మాణాలు చేపట్టడంతో ఆ నీరంతా ఇండ్లలోకి వస్తోంది. 

Also Read :- వరద బాధితులకు సీఎం రేవంత్​ రెడ్డి ఓదార్పు