Unstoppable With NBK Promo: బాలచంద్రుల ముచ్చట్లు.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 డైలాగ్స్తో ప్రోమో అదిరింది

Unstoppable With NBK Promo: బాలచంద్రుల ముచ్చట్లు.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 డైలాగ్స్తో ప్రోమో అదిరింది

అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ (Balakrishna). గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య..అస్సల్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌, అదిరిపోయే ప్రశ్నలతో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. 

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ సీఎం చంద్రబాబుునాయుడు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  తాజాగా మంగళవారం (అక్టోబర్ 22)న ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది.

"రెండు ఆపలేని శక్తులు.. ఒక అద్భుతమైన షో.. విజయసాధనలో పడ్డ ఇబ్బందులు, జనసేనానితో తనకున్న ఆప్యాయతలు, ఇలా ఎన్నో అంశాలు, అనుభూతులు, బాలచంద్రుల ముచ్చట్లతో మీ ముందుకు" అనే క్యాప్షన్ తో ఆహా తెలిపింది.

ఈ సందర్భంగా.. ‘చంద్రబాబునాయుడు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో ఏది అడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెబుతానని’ అంటూ ప్రమాణం చేయించగా, ‘సమయస్ఫూర్తిగా సమాధానం’ చెబుతా అని చంద్రబాబు అనడంతో నవ్వులు వెల్లివిరిశాయి. మా చెల్లితో మీరు చూసిన రొమాంటిక్ మూవీ ఒక్కటి చెప్పండని బాలయ్య అడిగితే.. నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఎలా అంటూ బాబు చమత్కరించారు.

అలాగే 'ఆకాశంలో సూర్యచంద్రుల్లాగే ఆంధ్రాలో బాబు గారు, కల్యాణ్ బాబు అంటున్నారంటూ బాలయ్య తనదైన స్టైల్లో చెప్పాడు. బాలకృష్ణ ఎక్కడుంటే అక్కడ జోక్స్ ఉంటాయంటూ బాబు చమత్కారంగా అన్నారు.దాంతో ఈ బావ, బావ మరదుల మధ్య సరదా సంభాషణతో అన్స్టాపబుల్ కి లిమిట్ లేదంటూ.. ప్రోమోతోనే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కాగా ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.