కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం.. నేలకొరిగిన పంటలు

కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం.. నేలకొరిగిన పంటలు
  • గన్నేరువరంలో పిడుగుపడి దున్నపోతు మృతి

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో  కూడిన వడగండ్ల వానకు మొక్కజొన్న, మామిడి రైతులకు అపారనష్టం కలిగింది. మాదాపూర్ గ్రామంలో మొక్కజొన్న నేలకొరిగింది. ఇదే గ్రామంలో మామిడితోటల్లో కాయలు నేలరాలాయి. గునుకొండాపూర్‌‌‌‌లో నేలపట్ల రాజయ్యకు చెందిన దున్నపోతు పిడుగు పడి చనిపోయింది. 

వేములవాడరూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​ మండలంలో గురువారం వడగళ్ల వర్షం కురవడంతో పంటలు నేలరాలాయి. నాగాయపల్లి గ్రామ శివారులో రోడ్డుపై చెట్టు కూలాయి. స్థానికులతో కలిసి బ్లూ కోల్ట్స్‌‌ సిబ్బంది శ్రీనివాస్, మల్లేశం చెట్లను తొలగించారు.