రైతన్నలకు శాపంగా అకాల వర్షాలు

రైతన్నలకు శాపంగా అకాల వర్షాలు

రైతన్నల కష్టాలు పంట ప్రారంభం నుంచి మొదలుకొని పంటను మార్కెట్లో అమ్మితేగాని తీరడంలేదనుకుంటే పంట చేతికి వచ్చి అమ్మే సమయంలో వచ్చేటటువంటి నష్టాలతో రైతన్న తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలకు తీవ్రశాపంగా మారాయి ఒకవైపు పగలు సమయంలో మండే సూర్యుడు.... సాయంత్రం నుంచి ఈదురు  గాలులు, ఉరుములు  మెరుపులతో కూడినటువంటి వర్షాలు రైతన్నలను కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. 

పంట చేతికి వచ్చిన సమయంలో వాతావరణంలో మార్పులు వస్తుండడంతో రైతన్నలను తీవ్రభయానికి గురిచేస్తుంది. వచ్చిన ఆదాయంతో అప్పులైనా తీరుతాయని అనుకుంటున్న రైతన్నకు ఈ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నాయి. ఎక్కువగా వరి పంటల నష్టం, అరటి, మామిడి తోటలు కుప్పకూలిపోవడం, బొప్పాయి తోటలు నేలమట్టం అవడం, మొక్కజొన్న తోట నష్టపోవడం.. రాష్ట్రంలో వందల కోట్లలో పంట నష్టం వాటిల్లింది. 

రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట బీమా పథకం  అందించాలి. నష్టపోయిన రైతులు మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పంట నష్టాన్ని అంచనావేసి రైతన్నను ఆదుకునే ప్రక్రియను వేగవంతం చేయాలి.

- డా.చింత ఎల్లస్వామి