కామారెడ్డి జిల్లాలో ఆయా చోట్ల శనివారం ఉదయం అకాల వర్షం కురిసింది. ఓ మోస్తరుగా వర్షం కురియడంతో వడ్లు తడిసిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 3 సార్లు ఆకాల వర్షం కురియగా.. 12 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వరి పైరు కోసి సెంటర్ల వద్ద , రోడ్డు పక్కన ఆరబోశారు. అకాల వర్షం కురియటంతో వడ్లు తడిచాయి. ఎల్లారెడ్డి, లింగంపేట, బీర్కూర్, బాన్సువాడ
పిట్లం, భిక్కనూరు మండలాల్లో వడ్ల కుప్పలు నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ ఏరియాలో ఉదయం నుంచి ముసురు వాన తో వడ్లు తడిశాయి. - కామారెడ్డి, ఆర్మూర్ వెలుగు