గత రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతలుకు అనుకోని నష్టాన్ని మిగిల్చింది. మరి కొద్ది రోజుల్లో పంట చేతికొస్తు్ందనుకున్న క్రమంలో మామిడి తోటలో కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్చి 16వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి కోరుట్ల, మెట్ పల్లి, మల్లాపూర్ మండలాల్లోని మామిడి తోటలో కాయలు కింద రాలిపోయాయి. పలు గ్రామాల్లోని తోటల్లో 30శాతం నుంచి 50 శాతం వరకు మామిడి కాయలు నేలరాలాయి.
ఇప్పటికే తేనెమంచుతో పూసిన పూతకు వాడిపోయి అంతంత మాత్రంగా కాసిన మామిడి... ఇప్పుడు వర్షంతో కాసిన కాయలు కూడా రాలిపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 15, 20 రోజుల్లో కాయలు కోసి.. మార్కెట్‌కు తరలించ్చొనుకుంటే అకాల గాలిదుమారం తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాస్తవానికి మామిడి కాయల తడిచినా, మచ్చలు వచ్చినా మార్కెట్లో వాటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపరు.