రియల్ లైఫ్ పాత్రలో సాయిపల్లవి

రియల్ లైఫ్ పాత్రలో సాయిపల్లవి

శివకార్తికేయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘అమరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకుడు. సోనీ పిక్చర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి సాయిపల్లవి పాత్రను పరిచయం చేశారు. అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ముకుంద్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. 

రిపబ్లిక్ డే పరేడ్ సీక్వెన్స్ తో ఇంట్రడక్షన్ వీడియో మొదలైంది. ప్రధాని మోదీ,  అప్పటి యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఇందు ముకుంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అశోక చక్ర అందజేస్తున్న రియల్ ఫుటేజీని చూపిస్తూ సాయిపల్లవి పాత్రను పరిచయం చేశారు.  ఆ తర్వాత ముకుంద్, ఇందు జంట ఎమోషనల్ జర్నీతో ఈ వీడియో కట్ చేశారు.

చివర్లో ‘ఈ సముద్రానికి ఆ నింగికి మధ్య ఉన్న దూరమే నాకూ తనకు’ అంటూ సాయిపల్లవి చెప్పిన డైలాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  తన స్క్రీన్ ప్రజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది.  జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. హీరో నితిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన  శ్రేష్ట్ మూవీస్ తెలుగులో విడుదల చేస్తోంది.