
యూత్ రీల్స్ పిచ్చి పీక్స్ కు చేరింది.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. ప్రాణాలనే ఫణంగా పెడుతున్నాడు.. రీల్స్ పిచ్చిలో ఏం చేస్తున్నామో కూడా సోయి లేకుండా పోయింది వీళ్లకు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, రైల్వే శాఖ.. ఆ కుర్రోడిని అరెస్ట్ చేసి జైల్లో వేసింది.. రైలు పట్టాలపై అత్యంత ప్రమాదకరంగా రీల్స్ షూట్ చేసిన ఘటన.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్- లక్నో మార్గంలో కుసుంభి స్టేషన్ సమీపంలో ఓ యువకుడు రీల్స్ కోసం రైలు ట్రాక్ మధ్యలో తన చేతులను ముందుకు చాచి, ఫోన్‌ను పట్టుకుని ఉన్నాడు. ఆ సమయంలో వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్లింది. తర్వాత అతను సేఫ్ లేచి మామూలుగా నిలబడ్డాడు.అతడికి ఏమి కాలేదు. ఇది ఆ వీడియోలో కనిపిస్తోంది.
►ALSO READ | బెంగళూరులాంటి పెద్ద సిటీలో మహిళలపై లైంగిక వేధింపులు కామన్: హోంమంత్రి పరమేశ్వర
అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఆ వీడియోను ఎడిట్ చేశారని..వీడియోలో కట్స్ ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఎడిట్ చేసిందా? లేక నిజమైందా తెల్వదు. మొత్తానికి రైల్వే పోలీసులు ఈ వీడియోలోఉన్న యువకుడు రంజిత్ చౌరాసియా( 22 ఏళ్ల)గా గుర్తించి అరెస్ట్ చేశారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అతని మీదుగా వెళుతుండగా అతను రైల్వే పట్టాలపై నిలబడి ఉన్నాడని.. అతనికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే ఆ వీడియో క్లిప్ ఎడిట్ చేయబడిందో లేదో తెలుస్తుందని రైల్వే అధికారి అరవింద్ పాండే తెలిపారు. ఈ కేసు గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
The name of this reelputra is Ranjit Chaurasia. He lay down on the track and let the whole train pass over him and Recorded a Reel of it, Now the reelputra has been arrested and is going to jail, Unnao UP
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 8, 2025
pic.twitter.com/NRO7VLAEtj