ఆపరేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యే మృతి

ఆపరేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యే మృతి

ఆపరేషన్ జరుగుతుండగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మృతి చెందని ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. స్థానిక డియోరియా జిల్లాలోని సదార్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే జన్మేజయ సింగ్ గత రాత్రి లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. జన్మేజయ సింగ్ కు తీవ్ర గుండెపోటు రావడంతో గుండెకు పేస్ మేకర్ అమర్చుతుండగా ఆయన మృతి చెందినట్లు రామ్‌ మనోహర్‌ లోహియా ఇనిస్టిట్యూట్‌ వైద్యులు తెలపారు. ఆయనకు హర్ట్ ఎటాక్ రాగానే ముందుగా సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో లోహియా ఇనిస్టిట్యూట్‌కు తరలించారు.

‘ఎమ్మెల్యే జన్మేజయ సింగ్ కు గురువారం రాత్రి గుండెపోటు వచ్చింది. ఆయనకు పేస్‌మేకర్ అమర్చే సమయంలో కన్నుమూశారు’అని రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఆయన మరణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జన్మేజయ సింగ్ అంకితభావంతో పనిచేసే వ్యక్తి. ఆయన తన నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. సమాజంలోని పేద, బలహీన వర్గాల కోసం ఆయన తపించి పని చేసేవారు. పార్టీకి అంకితభావంతో పనిచేసే నాయకుడిని బీజేపీ కోల్పోయింది. సదార్ నియోజకవర్గ ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయారు’అని సీఎం యోగీ అన్నారు. జన్మేజయ మరణం పట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు.

For More News..

తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు

చిన్న పట్టణాలకు మారుతున్న పెద్ద కంపెనీలు

గూగుల్‌ నుంచి సరికొత్త ‘కోర్మో’ జాబ్ యాప్