ఉత్తరప్రదేశ్ లోని 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆరు స్థానాల్లో NDA కూటమి లీడ్ లో ఉంది. ఎస్పీ మూడు స్థానాల్లో ముందంజలో ఉంది.
యూపీలోని మీరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్, కర్హల్, సిసామౌ, ఫుల్ పూర్, కతేహరి, మజ్హవాన్ స్థానాలకు నవంబర్ 20న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలతోపాటు ఎన్నికల జరిగాయి. మొత్తం11 మంది మహిళలు సహా 90 మంది బరిలో ఉన్నారు. ఈ ఫలితాలు యూపీ ప్రభుత్వం ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
మరోవైపు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకొనసాగుతుంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. శనివారం ఉదయం 10 గంటల వరకు జరిగిన కౌంటింగ్ ఫలితాల్లో మహారాష్ట్రలో 185 స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మహావికాస్ అఘాడీ 87 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ గెలుపు దిశగా సాగుతున్నారు. కొపిరి పచ్చపఖాడి సెగ్మెంట్ నుంచి శివసేన అభ్యర్థి షిండే భారీ ఆధిక్యంలో ఉన్నారు.