లాస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

లాస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

లోక్​సభ ఎన్నికలకు  చివరి విడత  పోలింగ్  కొనసాగుతోంది.  ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.అదేవిధంగా ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు బారులు తీరారు.  పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. పంజాబ్ లో  భారత మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ జలంధర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.  ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రవి కిషన్ & అతని భార్య ప్రీతి కిషన్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటు వేశారు. ఆయన సతీమణి మల్లికా నడ్డా కూడా ఇక్కడే ఓటు వేశారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం పరిధిలోని లఖ్‌నౌర్, సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్‌లోని ఏడో దశ పోలింగ్ కేంద్రంలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా  తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని  బెల్గాచియాలోని పోలింగ్ బూత్‌లో  బిజెపి నాయకుడు మిథున్ చక్రవర్తి ఓటు వేశారు.