- పరీక్షలు సక్కగ పెట్టనోడు ప్రభుత్వాన్ని ఏం నడుపుతడు
- యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్
ఆసిఫాబాద్: తెలంగాణలో నియంత సర్కార్ను తరిమేద్దామని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పిలుపునిచ్చారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడని కేసీఆర్ పై మండిపడ్డారు.కేవలం ముస్లింల కోసమే బీఆర్ఎస్సర్కార్పని చేస్తోందన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో నిర్వహిం చిన బీజేపీ సభలో ఆయన మాట్లాడారు.
‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. కాళేశ్వరంలో పేరుతో కేసీఆర్కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిం చిండు. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు ప్రభుత్వం ఏంనడుపుతాడు? ఎంఐఎం, బీఆర్ఎస్ కు కామన్ ఫ్రెండ్. కాంగ్రెస్ ఉంటే ఫ్రీ కరోనా వ్యాక్సిన్, బియ్యం ఇచ్చేదా? బీఆర్ఎస్ఓట్లు చీల్చేందుకు బీఎస్పీ రంగంలోకి దిగింది’ అని ఆరోపించారు.