నేడు తెలుగు రాష్ట్రాల్లో యూపీ సీఎం ప్రచారం

నేడు తెలుగు రాష్ట్రాల్లో యూపీ సీఎం ప్రచారం

మరో నాలుగు రోజుల్లో జరగబోయే ఎన్నికల కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిలో నిర్వహించే జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4:40 గంటలకు చిత్తూరు జిల్లాలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం యోగి ప్రచారం చేస్తారు. బీజేపీ తరఫున ఏపీలో ఇప్పటికే ప్రధాని మోడీ, ఆ పార్టీ అధినేత అమిత్‌షా ప్రచారం చేశారు.