ముందు మీ స్కూళ్లను చూస్కోండి.. యూపీ సీఎం పై కేజ్రీవాల్ ఫైర్

ముందు మీ స్కూళ్లను చూస్కోండి.. యూపీ సీఎం పై కేజ్రీవాల్ ఫైర్

న్యూఢిల్లీ: ఢిల్లీలో సౌలతులపై విమర్శలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందుగా సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల పరిస్థితిని చూసుకోవాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. గురువారం ఢిల్లీలో ఆప్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. 

‘‘యూపీలో బీజేపీ పదేండ్లకు పైగా అధికారంలో ఉన్నా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయలేదు.  అవసరమైతే  మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ను పంపిస్తం. స్కూళ్లను ఎలా బాగు చేయాలో నేర్పిస్తాం. బీజేపీ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 

ఆ రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది” అని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో వచ్చే ఐదేండ్లలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ‘‘యువతకు ఉపాధి కల్పించడమే నా ప్రాధాన్యత. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మా బృందం ఓ ప్రణాళికను రూపొందిస్తోంది. ఆ ప్రణాళికను అమలు చేసి, రాబోయే ఐదేండ్లో ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం” అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.