యూపీ సీఎంవో ట్విట్టర్ ఖాతాకు 60 లక్షల మంది ఫాలోవర్లు

యూపీ సీఎంవో ట్విట్టర్ ఖాతాకు 60 లక్షల మంది ఫాలోవర్లు

లక్నో: ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్(యూపీ సీఎమ్‎వో) అరుదైన ఘనత సాధించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో 60 లక్షల మంది ఫాలోవర్లతో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో యూపీ సర్కారు ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరుగా ప్రజలతో మాట్లాడుతారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చిన్నారులతో ముచ్చటిస్తారు. ‘జనతా దర్శన్’ వంటి కార్యక్రమాల్లో ప్రజాసమస్యలను నేరుగా వినడంతో పాటు అధికారులు ఆ సమస్యలను పరిష్కరించేలా చూస్తారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిత్యం సంభాషిస్తూ సోషల్ మీడియా ద్వారా అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తారు”  అని యూపీ ప్రభుత్వం తెలిపింది.