
2016లో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 59 ఏళ్ల వ్యక్తికి లక్నో ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. రాథోడ్ అనే రిక్షా పుల్లర్.. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆమె తల వెనుక.. ముఖంపై గాయాలున్నాయి. 2016 మార్చి 17న కేసు నమోదు కాగా.. మరుసటి రోజు బాలిక మృతదేహం లభ్యమైంది. విచారణలో, బాధితురాలు చివరిసారిగా నిందితుడితో కనిపించిందని నిర్ధారణ అయింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.